TG: త్వరలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగనున్న నేపథ్యంలో ఇద్దరు మంత్రులపై వేటు పడనుందని గాంధీభవన్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ లిస్టులో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖల పేర్లు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒకరి స్థానంలో ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి కట్టబెడుతారనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధిష్ఠానం ఏం ఆలోచిస్తుంది.. వీరిని తప్పించే సాహసం చేస్తుందా, లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.