ఏపీలో మూడు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో పోటీ లేకపోవడంతో రాజ్యసభకు వీరి ఎన్నిక లాంఛనమైంది. ఎన్నికైన అభ్యర్థులు శుక్రవారం ఆర్వోసి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.