బెజ్జంకి మండలం - Bejjanki Mandal

సిద్దిపేట జిల్లా
నీలం మధు మేనిఫెస్టో ఇదే
May 12, 2024, 11:05 IST/దుబ్బాక
దుబ్బాక

నీలం మధు మేనిఫెస్టో ఇదే

May 12, 2024, 11:05 IST
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలను మెరుగు పరచడానికి కృషి చేస్తానన్నారు. మెదక్ పార్లమెంటులో నూతన పరిశ్రమలకు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువతకు వృత్తి నైపుణ్యాలలో శిక్షణను ఇచ్చి ప్రతి ఆరు నెలలకు జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రానున్నదని ప్రభుత్వ సహకారంతో ఐ.టి.ఐ.ఆర్ ప్రాజెక్టు ను పునరుద్ధరించి మన ప్రాంతాన్ని ఐటీ హబ్ గా మార్చడానికి ప్రయత్నిస్తానన్నారు. ప్రతివారం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో బస చేసి ఆ ప్రాంత సమస్యలను స్వయంగా తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రతి నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకొని నిధులు కేటాయించి మెదక్ పార్లమెంటును మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ ప్రజలందరికీ అండగా నిలబడతానని స్పష్టం చేశారు. పార్లమెంటులో కార్మికుల హక్కులపై గొంతెత్తి కార్మికుల, జర్నలిస్టుల న్యాయబద్ధమైన డిమాండ్లను సాధిస్తానన్నారు.