దుబ్బాక మండలానికి చెందిన ఐకేపీ ఇన్ ఛార్జ్ ఏపీఎం నర్సింలు గురువారం ఉత్తమ అవార్డుకి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆగస్టు 15 సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతుల మీదగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. విధి నిర్వహణలో మరింత బాధ్యతాయుతంగా పని చేయాలని ఎపీఎంకి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, డిఆర్డిఏ పిడి జగదేవ్ ఆర్య, తదితరులు ఉన్నారు.