దుబ్బాకలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆపాలని మూడవ వార్డు కౌన్సిలర్ మల్లారెడ్డి 8వ వార్డు కౌన్సిలర్ దుబ్బాక బాలకృష్ణ గౌడ్ లు అన్నారు.
సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. దుబ్బాక మున్సిపాలిటీలో ప్రభుత్వ అనుమతులు లేకుండా జరుగుతున్న భవనాల నిర్మాణాలు వెంటనే ఆపాలని కోరారు. ఈ విషయంలో దుబ్బాక మున్సిపల్ ఛైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు.