ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శనివారం రాత్రి నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు వేకువజామునే కోనేరులో పవిత్ర స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి క్యూలైన్ లో నిలిచి దర్శించుకున్నారు. రేగు చెట్టు వద్ద, మహామండపంలో పట్నాలు వేసి, కేశ కండన, అభిషేకం, అర్చన, కళ్యాణం, రేగు చెట్టుకు ముడుపులు, తిరుగుడు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.