దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి రూ. 10 లక్షలు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మెట్ల సంజీవ్ మంగళవారం అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తుల తరఫున ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, దుబ్బాక నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మరియు మండల అధ్యక్షులు కొంగరి రవి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.