దుబ్బాక: బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు చెపూరి శేఖర్ గౌడ్ తండ్రి బాలాగౌడ్ (61) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ శనివారం వారి ఇంటికి వెళ్లి ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి పంతులు, కొత్త దేవిరెడ్డి, బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సురేష్ గౌడ్, రాయపోల్ మండల యువ నాయకులు ప్రసాద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.