భూములు ఇస్తే మమ్మల్ని బెదిరిస్తారా

69చూసినవారు
సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లికి చెందిన రైతులు ఆదివారం మల్లన్న సాగర్ పెద్ద కాల్వ వద్ద ఆందోళన చేశారు. కాలువ పనులకు భూములు ఇచ్చామని, తమకు చెల్లించాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావలసిన డబ్బులు చెల్లించాలని కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ వారిని రైతులు వేడుకున్నారు. వచ్చే నెల డబ్బులు చెల్లిస్తామని సంస్థ హమి ఇచ్చిందని రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్