సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం వేకువ జామునే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాలిగామకు వెళ్ళు రోడ్డులో బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ పైఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పరంధాములు రాయపోల్ పోలీసు స్టేషన్లో, పూస వెంకటేశ్వర్లు దౌల్తాబాద్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.