గజ్వేల్: కాలాన్ని కనుగుణంగా ఆంగ్లభాషా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి

67చూసినవారు
గజ్వేల్: కాలాన్ని కనుగుణంగా ఆంగ్లభాషా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల చేత పోస్టర్ ప్రజెంటేషన్ ను నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఎస్. గణపతి రావు మాట్లాడుతూ మారుతున్న కాలాన్ని కనుగుణంగా విద్యార్థులు ఆంగ్లభాషా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. అలాగే కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ మాట్లాడుతూ నేటి యుగంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్