గజ్వేల్: రామకోటి రామరాజును అభినందించిన మాజీ ఎమ్మెల్యే

65చూసినవారు
గజ్వేల్: రామకోటి రామరాజును అభినందించిన మాజీ ఎమ్మెల్యే
సిద్దిపేట జిల్లా గజ్వేల్ రామాలయంలో వాసవి యూత్ ఆధ్వర్యంలో శనివారం దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు 30 అడుగుల భారీ శివ లింగాన్ని శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షులు రామకోటి రామరాజు అద్భుతంగా చిత్రించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆలయాన్ని సందర్శించి రామరాజును అభినందించారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శేఖర్, సంతోష్, వెంకటేశం, వాసవి ఉన్నారు.

సంబంధిత పోస్ట్