తుర్కపల్లి మండలం గంధముల మధిర గ్రామానికి చెందిన పిట్టల వెంకటయ్య(50) వ్యవసాయ పనుల నిమిత్తం జగదేవ్ పూర్ కి వెళ్లి పనులు ముగించుకుని నడుచుకుంటూ వస్తుండగా గాంధీ విగ్రహం వద్ద భువనగిరి నుండి గజ్వేల్ వెళ్తున్న లారీ వెంకటయ్యను బలంగా ఢీ కొన్నాడు. తీవ్ర గాయాలపాలయిన వెంకటయ్యను హైదరాబాద్ మెరుగైన చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.