జగదేవపూర్ మండల ఆర్యవైశ్య నాయకులు బుధవారం మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తృతీయ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదేవపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కుకుటపు కొండలు మాట్లాడుతూ హైదరాబాద్ హైటెక్స్ లో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై రోశయ్య కు ఘన నివాళి అర్పించడం జరిగిందని అన్నారు.