కొండపాకలోని చరిత్ర కలిగిన రుద్రేశ్వరాలయ అభివృద్ధికి కృషి

59చూసినవారు
శతాబ్దాల చరిత్ర కలిగిన కొండపాకలోని రుద్రేశ్వరాలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ పక్షాన నిధుల మంజూరుకు ప్రయత్నిస్తానని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేవాలయంలో శుక్రవారం మాస శివరాత్రి సందర్భంగా మాజీ మంత్రి మదన్ మోహన్ కుమార్తె అనుపమ అశోక్ నాయుడు శత రుద్రాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్