సిద్దిపేట: జాతీయస్థాయి జూడో పోటీలకు తెలంగాణ కోచ్ గా చామంతుల భరత్

51చూసినవారు
సిద్దిపేట: జాతీయస్థాయి జూడో పోటీలకు తెలంగాణ కోచ్ గా చామంతుల భరత్
సిద్దిపేట జిల్లా కోహేడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన చామంతుల భరత్ ఎస్జిఎఫ్ అండర్-17 తెలంగాణ బాలికల టీం కోచ్ గా నియమించినట్లు రాష్ట్ర ఎస్జిఎఫ్ సెక్రటరీ రామ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. భరత్ పంజాబ్ లోని పటియాలలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూడో క్రీడలో ప్రత్యేక శిక్షణ తీసుకొని రాష్ట్ర స్థాయి జాతీయస్థాయి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి తర్ఫీదు చేసిన అనుభవం ఉన్నందున ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్