ఆర్యవైశ్యులు వ్యాపారంతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో జిల్లా ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారంతో ఆర్థిక అభివృద్ధి సాధించే వైశ్యులు రాజకీయంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్యులను ప్రోత్సహించడమేకాకుండా అండగా ఉంటుందన్నారు.