హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో సుమారు 1200 సంవత్సరాల క్రితం శ్రీ మల్లికార్జున స్వామి స్వయంభుగా వెలిచారని ఆలయానికి వచ్చే భక్తుల కోరికలను తీరుస్తారని భక్తుల నమ్మకం. 300 సంవత్సరాల క్రితం వరకు నూటమూడు ఆలయాల నిలయంగా శైవ క్షేత్రంగా విరాజిల్లిన మల్లికార్జున స్వామి వారి ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు రావడంతో ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే ఆలయానికి పునర్ వైభవం వస్తుందని గ్రామస్తులు అంటున్నారు.