సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట్, హుస్నాబాద్ మండలాల్లో 15. 39 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంఖుస్థాపనలు చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కారం చేస్తామని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని అన్నారు.