హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారులకు ఇన్స్పెక్టర్ ఎర్రల కిరణ్ బుధవారం పోలీస్ స్టేషన్ ఎదుట కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి. ఐ. కిరణ్ మాట్లాడుతూ వాహన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. మద్యం తాగి వాహనం నడిపేవారు అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని తెలిపారు. తాగి వాహనం నడపడం వల్ల దేశంలో సంవత్సరానికి లక్ష 50 వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు.