ఆటోను ఢీకొట్టిన కారు మహిళ అక్కడికక్కడే మృతి
కోహెడ మండల పరిధిలోని శంకర్ నగర్ రాజీవ్ రహదారిపై ఆటోను కారు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం బెజ్జంకి మండల పరిధిలోని రేగులపల్లి గ్రామానికి చెందిన కొమ్మర లక్ష్మి తన తల్లి ఇంటి నుంచి ఆటోలో తిరుగు ప్రయాణంలో రాజీవ్ రహదారి వద్ద మంచిర్యాల జిల్లాకు చెందిన కారు అతివేగంతో ఆటోను ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.