ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలి: కలెక్టర్

81చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలి: కలెక్టర్
ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన వారు ఈనెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్ లైన్, ఏఈఆర్ఓ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పట్టభద్రుల ఓటర్లు ఫారం నెంబర్- 18, ఉపాధ్యాయ ఓటర్లు ఫారం నెంబర్- 19లో దరఖాస్తు చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్