ఎద్దు విచిత్ర ప్రవర్తనతో మనుషులపై దాడి

6893చూసినవారు
జిన్నారం మండలం మాదారం గ్రామంలో ఆదివారం వింత పరిణామం చోటుచేసుకుంది. ఓ ఎద్దు విచిత్రంగా ప్రవర్తిస్తూ మనుషులపై దాడి చేసింది. దీంతో భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు వెంటనే తాడు సహాయంతో ఎద్దును బంధించి వెటర్నరీ డాక్టర్లకు సమాచారం అందించారు. కాగా ఆ ఎద్దును పరిశీలించిన డాక్టర్లు బహుశా కుక్క కరిచి ఉండవచ్చని అందుకే ఇలాగ పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తుందని, అక్కడి నుంచి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్