జిన్నారం: రియాక్టర్ పెలీ పలువురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

68చూసినవారు
జిన్నారం: రియాక్టర్ పెలీ పలువురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలోని శ్రీకర రసాయన పరిశ్రమలో సోమవారం రియాక్టర్ పేలి ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్తితి విషమంగా మారింది. ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికులు బీజేశ్, ఈశ్వర్ చంద్ర అగారియా, పుష్పరాజ్, సుందర్ సింగ్, చాంద్ ప్రతాప్, షేఖ్ అన్వర్, నీలేష్ సింగ్ గా గుర్తించారు. కార్మికులను మదీనా గూడ లోని ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్