సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో శనివారం ఉదయం గుర్తు తెలియని శవం లభ్యమైనదని సీఐ భాస్కర్ తెలిపారు. బస్టాండ్ సమీపంలో వ్యక్తి పడి ఉండడంతో కంట్రోలర్ కిషన్ 108 కి సమాచారం అందించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తి మరణించి నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఎవరైనా గుర్తు పడితే 08455-276333, 8712656718 నెంబర్లకు సంప్రదించాలని సీఐ తెలిపారు.