'సినారె ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపన్యాసకులుగా ఉంటూనే 1962లో నందమూరి తారక రామారావు ఆహ్వానంపై సినిమా రంగంలో ప్రవేశించారు. సినారె రచించిన తొలి సినీ గీతం ‘గులేబకావళి కథ’ చిత్రంలోని ‘‘నన్ను దోచుకొందువటే’’. ఆనాటి ‘గులేబకావళి కథ’ చిత్రం నుంచి ఇటీవలి ‘అరుంధతి’ సినిమాల వరకు మూడున్నర వేలకు పైగా సినిమా పాటలు రచించారు. ‘ఏకవీర’, ‘అక్బర్ సలీమ్ అనార్కలీ’ అనే రెండు చిత్రాలకు సంభాషణలు కూడా రచించారు.