బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో తీవ్ర విషాదం జరిగింది. మంగళవారం రాత్రి 12 గంటల సమయం లో రాకేష్ (19) బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. మిత్రునితో కలిసి బైక్ పై వెళ్తుండగా గుండి గోపాల్ రావు పేట సమీపంలో అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు బంధువులు తెలియజేసారు.