బోయినపల్లి మండలం వరదవెల్లిలో నేటి నుండి 16 వరకు దత్త జయంతి ఉత్సవాలకు ఘనంగా నిర్వహణ ఏర్పాట్లు కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. మూడు రోజులు స్వామివారికి అభిషేకాలు, సత్య దత్త వ్రతాలు, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని, స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయని 44వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. దత్తాత్రేయ ఆలయానికి వెళ్లేందుకు బోట్ సౌకర్యాన్ని కల్పించినట్లు వారు తెలిపారు.