రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం, బోయినపల్లి మండలం కోరేం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. గౌడ సంఘం ప్రధాన దైవమైన రేణుక ఎల్లమ్మ జాతరలో భాగంగా తొలిరోజు పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.