ధర్మారం మండలం నంది మేడారం కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్ ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడారం కోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సర్టిఫికెట్ ను న్యాయవాదులకు అందజేశారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారా అశోక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశం, లింగారెడ్డి, ప్రదీప్, సంపత్, గణేష్, రజిత పాల్గొన్నారు.