జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం లోని జైన గ్రామంలో స్థానిక కల్కి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు గుడ్ల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తన తండ్రి గుడ్ల సత్య నారాయణ, తన సోదరుడు గుడ్ల శ్రీకాంత్ జ్ఞాపకార్థం సుమారు మూడు లక్షల రూపాయల విలువ కలిగిన వైకుంఠ రథంకు శుక్రవారం ప్రారంభించారు. కాయ కోట్టి జైన కోసునూర్ పల్లె ఉమ్మడి గ్రామాల సర్పంచ్ లకు గుడ్ల విజయ్ కుమార్ అందజేశారు. వైకుంఠ రథం కోసం పార్కింగ్ తో పాటు, షెడ్ నిర్మించాలని ఆయన ఉమ్మడి గ్రామాల సర్పంచ్ లతో పాటు, ఉమ్మడి గ్రామాల ప్రజాప్రతినిధులను కోరారు. వారితో పాటు, జైన, కోసునూర్ పల్లె ఉమ్మడి గ్రామాల సర్పంచ్లు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు, స్థానిక యువత, కల్కి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు ఉన్నారు.