పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి ధర్మారం మండల కేంద్రానికి వయా కుమ్మరికుంట ఆర్టీసీ బస్సు కేవలం ధర్మారం మోడల్ స్కూల్ పనిదినల్లో మాత్రమే నడుస్తోంది. స్కూల్ ఉన్న రోజుల్లో కేవలం ఉదయం, సాయంత్రం ట్రిప్ మాత్రమే వస్తుంది. ప్రతిరోజు నాలుగు ట్రిప్పులు సరైన సమయాలలో నడిపించాలని గురువారం సామాజిక కార్యకర్త బత్తిని అనిల్ కుమార్ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి. రాజుకి వినతి పత్రం అందజేశారు.