ఎస్ఎస్సి లో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు

466చూసినవారు
ఎస్ఎస్సి లో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు
ఎస్ఎస్సి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు నంది మేడారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి లలిత గురువారం పేర్కొన్నారు. గత ఏడాది మండలంలో 9. 8 జీపీఏ తో అత్యుత్తమ స్థానాన్ని సాధించామని ఈ ఏడాది ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రోజు ఉదయము, సాయంత్రము ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విషయ ఉపాధ్యాయులు విద్యార్థులకు వివిధ సబ్జెక్టులలో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తున్నారని అన్నారు. ప్రత్యేకమైన స్టడీ మెటీరియల్ను అందజేసి సాధన చేపిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతము పదవ తరగతిలో 52 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, ఈసారి 10/10 జిపిఏ సాధించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. కొందరు విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాలైన గోపాల్ రావు పేట, శాయంపేట గ్రామాల నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరి మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి చేరుతున్నారని చెప్పారు. దాతలు ఎవరైనా స్పందించి విద్యార్థులకు సాయంత్రం పూట స్నాక్స్ అందించే ఏర్పాటు చేస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్