ధర్మారం మండలం మేడారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం రోజున ఆరోగ్యమేళాను నిర్వహించడం జరిగింది. దీనిలో క్యాన్సర్ మరియు ఎన్సీడీ పైన రోగులకు అవగాహన కల్పించారు. ఆరోగ్యమేళాకు హాజరైన వారికి బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ అనుదీప్, హెచ్ ఈ ఓ రాజారెడ్డి, స్టాఫ్ నర్స్ కృష్ణవేణి, ఫార్మాసిస్టు కృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్ రమేష్ పాల్గొన్నారు.