ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు

1038చూసినవారు
ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు
ధర్మారం మండలంలోని నంది మేడారం గ్రామంలో రైతు వేదిక వద్ద ఏ ఈ ఓ ప్రియ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటల పెంపకం చాలా లాభదాయకమని, ప్రభుత్వం ఎకరాకు సంవత్సరానికి 4200 రూపాయలు నాలుగు సంవత్సరాల పాటు సహాయం చేస్తుందని వివరించారు. ఆసక్తిగల రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ జానకి. ఉప సర్పంచ్ రమేష్. ఎంపీటీసీ మిట్ట తిరుపతి, రైతుబంధు సమితి అధ్యక్షుడు చిన్న లచ్చయ్య, రైతుబంధు సమితి సభ్యులు, రైతులు రాసూరి కిషన్, రాచూరి మల్లారెడ్డి బోరకుంట అంజయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్