ధర్మారం మండలం శాయంపేటలో గత మూడు రోజులుగా నిర్వహించబడుతున్న కంటి వెలుగు శిబిరము నేటితో ముగిసింది. శుక్రవారం మొత్తం 428 మందికి కంటి పరీక్షలు చేయగా 158 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేసినట్లు డాక్టర్ అనుదీప్ తెలియజేశారు. కంటి వెలుగు శిబిరాన్ని విజయవంతముగా పూర్తి చేసినందున సిబ్బందిని స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి శ్రీనివాసు మరియు పంచాయతీ కార్యదర్శి శాలువాతో సన్మానించారు. వైద్యాధికారి డాక్టర్ అనుదీప్, డాక్టర్ సుస్మిత, సూపర్వైజర్ జయ, ఏఎన్ఎం మృణాళిని ఆప్తాలనిస్టు అబ్దుల్ వసీ, డాటా ఆపరేటర్ నరేష్, ఆఫీస్ సబార్డినేట్ మల్లేశం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.