ధర్మారం మండలం నంది మేడారంలో గత 23 రోజులుగా నిర్వహించబడుతున్న కంటి వెలుగు ఆరోగ్య శిబిరం నేటితో ముగిసింది. ఈ శిబిరంలో ఇప్పటివరకు 3, 100 మందికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలను పంపిణీ చేశామని, మరికొందరిని ఆపరేషన్ నిమిత్తము రిఫర్ చేసినట్లు డాక్టర్ సుస్మిత తెలియజేశారు.
కంటి వెలుగు శిబిరం విజయవంతంగా ముగిసినందున సిబ్బంది కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయ, ఆప్తాలనిస్టు అబ్దుల్ వసీ డాటా ఆపరేటర్ నరేష్, ఆఫీస్ సబార్డినేట్ మల్లేశం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.