హుజురాబాద్ పట్టణంలో ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం గ్రామీణ స్థాయి సీఎం కప్ బాలికల ఖోఖో పోటీలను మండల పరిషత్ అధికారి సునీత ప్రారంభించారు. ఆర్గనైజేషన్ కార్యదర్శి సారయ్య మాట్లాడుతూ మండల స్థాయి బాల బాలికల క్రీడా పోటీలు ఈ నెల 10, 11, 12 తేదీలలో జరుగుతుందని తెలిపారు. తరువాత జిల్లా స్థాయిలో కరీంనగర్ లో పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.