జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే సమాచారంతో పూడూరు గ్రామంలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 12కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.