ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితి ఏకగ్రీవ ఎన్నిక

529చూసినవారు
ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితి ఏకగ్రీవ ఎన్నిక
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గల వెల్గటూర్ మండలం లోని స్తంభం పల్లి గ్రామంలో గల స్థానిక హరిత హోటల్ వద్ద జాతీయ రహదారి పక్కన ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, క్రీభూకో సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గత కోద్దీ రోజులుగా పాషిగామ, వెంకటా పూర్, స్తంభం పల్లి గ్రామాలతో పాటు, వెల్గటూర్ పట్టణ ప్రజలు ఈ ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఇథనాల్ పరిశ్రమ మూడు గ్రామాలతో పాటు, వెల్గటూర్ పట్టణ కేంద్రంకు సుమారు కీలో మీటర్ దూరం కూడా లేక పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు, పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే కాలుష్యంతో పాటు, పక్కనే కీలో మీటర్ దూరంలో ఉన్న గోదావరి నదితో పాటు, స్థానికంగా ఉండే చెరువులు, నదులు, బావులు, పంట పోలాలు, పండ్ల తోటలు, కలుషితం అవుతాయి అని వీటితో పాటు, వాయు, నీటి కాలుష్యం అవుతాయి అని వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆదివారం ఉదయం వేళలో సమావేశం నిర్వహించి మధ్యాహ్నం వేళలో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఇథనాల్ పరిశ్రమ పోరాట వ్యతిరేక సమితిని ఏర్పాటు చేసి ఈ ఉద్యమానికి గౌరవ అధ్యక్షుడిగా చల్లూరి రూపా రాణి - రామ చందర్ గౌడ్ లతో పాటు, అధ్యక్షుడిగా పోడేటి సతీష్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా గ్రామ ప్రజలను వివిధ హోదాలలో కమిటీ సభ్యులుగా నియామిస్తూ ఏకగ్రీవంగా తీర్మానంను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల సమక్షంలో ఆమోదించారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా వెల్గటూర్ మండల ప్రజలకు, వెల్గటూర్ మండల ఆర్యా వైశ్య సంఘము, వెల్గటూర్ మండల ఆర్యా వైశ్య యువత తరపున తమ మద్దతు ఇస్తున్నట్టు ఆర్యా వైశ్య యువ నాయకుడు అవ్వ సాయి కృష్ణ, రాజన్న, లింగన్న మీడియాకు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో వారితో పాటు, సీనియర్ ఉద్యమ కారుడు కిరిటి ఆనంద్ లతో పాటు, వెల్గటూర్ మండల ప్రజలు, ఆయా గ్రామాల యువత, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్