జగిత్యాల రూరల్ మండలంలోని ధరూర్ గ్రామంలో బుధవారం అనుమానాస్పదంగా వానరం మృతి చెందడంతో వానరానికి అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకుని, అంత్యక్రియలు చేయడం జరిగిందనీ పంచాయతీ సెక్రటరీ అజయ్ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ధరూర్ గ్రామ పంచాయితీ కారోబార్ వంశీ, ఎలక్ట్రీషియన్ బషీర్, గ్రామ పంచాయతీ నడిపి గంగారాం, పెద్ద గంగారాం, సంజీవ్, పోచయ్య, నర్సయ్య, రజిత, తదితరులు పాల్గొన్నారు.