జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ డీఅర్డిఓ కార్యాలయంలో అభివృద్ది పనులపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జగిత్యాల నియోజకవర్గంలో ఈజిఎస్, శిధిలావస్థలో ఉన్న వెటర్నరీ ఆసుపత్రి పునః నిర్మాణంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డివో రఘువరన్, జిల్లా సంక్షేమ అధికారి డా. నరేష్, ఏపిడి మదన్ మోహన్, డిఈఓ రాము నాయక్, పిఅర్డిఈ మిలింద్ పాల్గొన్నారు.