జైన గ్రామంలో ఘనంగా శ్రీ రామ నవమి వేడుకలు

874చూసినవారు
జైన గ్రామంలో ఘనంగా శ్రీ రామ నవమి వేడుకలు
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం లోని జైన గ్రామంలో గల స్థానిక శ్రీ రామ కళ్యాణ మండప వేదిక యందు శ్రీ రామ నవమి పురస్కరించుకోని, గురువారం ఉదయం వేళ నుండి సాయంత్రం వేళ వరకు. శ్రీ సీత రాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను ఆలయ అర్చకులు, వేద పండితులు, ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ తధానంతరం భక్తులు, గ్రామస్తుల సహాయ సహకారంతో. అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి అన్నదాన కార్యక్రమంలో కల్కి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ జైన, కోసునూర్ పల్లె గ్రామాల యువత పెద్ద ఎత్తున పాల్గోని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఉచితంగా ప్రథమ చికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి, తమ మానవత్వాన్ని చాటుకున్నారు. కల్కి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ. ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవడం మా యూత్ సభ్యులకు చాలా సంతోషకరమైన విషయం అని తెలుపుతూ. మున్ముందు మా గ్రామాలలో జరిగే ఎలాంటి కార్యక్రమాలు అయినా సరే ముందు ఉండి తమ సేవలను అందిస్తామని వారు మీడియాకు తెలిపారు. ఉదయం వేళ నుండి సాయంత్రం వేళ వరకు తమ సేవలు అందించిన కల్కి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను, గ్రామ ప్రజలు, తదితరులు ఘనంగా అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో వారితో పాటు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆయా గ్రామాల ప్రజలు, మహిళాలు, యువత, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, కల్కి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్