కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానానికి వచ్చిన బండి సంజయ్ వాకర్స్ ను కలిశారు. గ్రౌండ్ మొత్తం కలియ దిగుతూ వాకర్స్ ను కలుస్తూ బీజేపీకి ఓటేయాలని అభ్యర్ధించారు. మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరును ఎండగట్టారు. కరీంనగర్ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపై తనదైన శైలిలో పంచ్ లు విసిరారు.