సిరిసిల్ల జిల్లా బీజేపీ ఎస్సీ సెల్ ఇంచార్జి నియామకం

460చూసినవారు
సిరిసిల్ల జిల్లా బీజేపీ ఎస్సీ సెల్ ఇంచార్జి నియామకం
కరీంనగర్ పట్టణం 18 వ డివిజన్ లో పశ్చిమ జోన్ బిజెపి పార్టీ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నూతనంగా బిజెపి రాష్ట్ర ఎస్ సి మోర్చా అధికార ప్రతినిధి జాడి బాల్ రెడ్డి కి సిరిసిల్ల జిల్లా ఎస్సీ మోర్చ ఇంచార్జి నియామకం జరిగినందున వారికి ఘనంగా పుష్పగుచ్ఛాలు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..... పశ్చిమ జోన్ 18 వ డివిజన్ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చార్జిగా నియమించినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొప్పు భాషా కి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే ఎస్సి మోర్చా బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. అనంతరం బాల్ రెడ్డి మాట్లాడుతూ... నా మీద నమ్మకం ఉంచి నాకు జిల్లా ఇన్చార్జి గా బాధ్యతలు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూచన మేరకు ఎస్సీ మోర్చ అధ్యక్షులు కొప్పు భాష ఆధ్వర్యంలో నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సీ మోర్చా బలోపేతానికి టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి టిఆర్ఎస్ పార్టీ పైన ఉద్యమం పోరాటం చేస్తామని అన్నారు.

రాష్ట్ర ఓబిసి కార్యవర్గ సభ్యులు ధర్మారం వెంకటస్వామి, జిల్లా బిజెపి అధికార ప్రతినిధి జాన పట్ల స్వామి, పశ్చిమ జోన్ ఉపాధ్యక్షులు ఎడమ సత్యనారాయణ రెడ్డి, పశ్చిమ జోన్ ప్రధాన కార్యదర్శి మామిడి రమేష్, జిల్లా ఎస్సీ మోర్చాఅధికార ప్రతినిధి ఎర్రోళ్ల ప్రశాంత్, పశ్చిమ జోన్ బీజేపీ కార్యదర్శి దయ్యాల మల్లేశం, పశ్చిమ జోన్ ఓబిసి కార్యదర్శి చంద్రగిరి, వేణు, అప్పాల శ్రీనివాస్, కైలాస నవీన్, శ్రీనివాస్, నాగుల వెంకటేష్ గౌడ్, కొత్తపెళ్లి మాజీ ఉప సర్పంచ్ అనుమల చంద్రమౌళి, దుర్గమ్ఆంజనేయులు, అక్క పెళ్లి వెంకటేష్, దుర్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్