కోరుట్ల మండలం మోహన్ రావ్ పేట గ్రామ శివారులో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ద్విచక్రవాహనం ఢీ కొని ప్రమాదంలో ద్విచక్ర వాహన దారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం రెండు ముక్కలైంది. మృతి చెందిన వ్యక్తి నిజామాబాద్ జిల్లా కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.