శంకరపట్నం మండలం కన్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998 -99 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత, సిల్వర్ జూబ్లీ పూర్తి చేసిన సందర్భంగా గ్రామంలోని హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మిత్రులు చాలా రోజుల తర్వాత కలుసుకొని, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని సంతోషం వ్యక్తం చేశారు.