శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాగోని బస్వయ్య ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇటీవల కేటీఆర్ మహిళలకు ఫ్రీ బస్సు విషయంలో మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారని దాన్ని నిరసిస్తూ శంకరపట్నం మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.