రైతులు ఎదుర్కొంటున్న పలురకాల సమస్యలతో పాటుగా ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తానని చెప్పిన 6 గ్యారంటీలను అమలు చేయకపోవడంతో బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు శుక్రవారం రామక్రిష్ణకాలనీలో బీజేపీ నాయకులు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించారు.