ప్రతీ రోజు యోగా చేస్తే ఆరోగ్య పరంగా జీవన విధానంలో మార్పు ఉంటుందని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా శుక్రవారం కొత్తపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో శిక్షకులు కందుకూరి నరేందర్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ వారసత్వ సంపదైనటువంటి యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం ప్రధాని మోదీకే సాధ్యమయిందని నరేందర్ అన్నారు.